తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు.
వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.
దప్పికతో సంబంధం లేకుండా అవసరమైన నీటిని తాగాలి.
ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, పళ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలి.
ప్రయాణ సమయంలో తాగునీటి బాటిళ్లను వెంట ఉంచుకోవాలి.
సీజనల్ పండ్లను తినాలన్నారు.
సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలి, మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండల సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలి.
అల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
వదులుగా ఉండే లైట్ కలర్ కాటన్ వస్త్రాలను ధరించాలి.