ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్నాడు ప్రభాస్.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.

అయితే ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ టైమ్ లో ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నట్లు సమాచారం.

ఇక అప్పటి నుంచే ప్రభాస్ కు తరచుగా జ్వరం రావడం మెుదలైందంట. దాంతో డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట.

అయితే ప్రభాస్ మాత్రం అన్ని షూటింగ్స్ కంప్లీచ్ చేసి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడట.

కానీ డార్లింగ్ అనారోగ్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కచ్చితంగా ట్రీట్ మెంట్ తీసుకోవాలని నిర్ణయిచుకున్నాడట.

అందుకోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లాడని సమాచారం.

అయితే ప్రభాస్ టీమ్ మాత్రం అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభాస్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లాడు అని చెబుతున్నారు.

ఇక ప్రభాస్ కు ఏమైందో తెలియాలి అంటే డార్లింగ్ ఫారిన్ నుంచి తిరిగా వచ్చేదాక ఆగాల్సిందే.