‘ఆదిపురుష్’ విడుదలకి సిద్ధమవుతుండగా.. మరోవైపు మూడు చిత్రాల్ని సమాంతరంగా నడిపిస్తున్నారు ప్రభాస్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో హీరో ప్రభాస్‌తోపాటు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు
పది రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది
ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి కూడా చోటుంది
ఇటీవలే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రీకరణలో పాల్గొన్న ప్రభాస్ ఇప్పుడు ఈ చిత్రంపై దృష్టిపెట్టారు