పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలన్నీ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది

డార్లింగ్ నటించిన లాస్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది

దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ దశలో ఉంది

ఇక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు

వీటితో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలెక్స్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు

ఇదిలా ఉంటే ప్రభాస్ తో మరో స్టార్ హీరోను కలిపి బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట

ప్రభాస్ తో నటించే ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్

ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిమించనున్నారని తెలుస్తోంది

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది