డార్లింగ్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.

ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే.. దాంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

పాన్ ఇండియన్ హీరో ప్రభాస్.. హీరోగా.. క్రేజీ డైరెక్టర్ మారుతీ ఓ సినిమా ప్లాన్ చేశారు.

హర్రార్ కామెడీ నేపథ్యంలో.. ఇంతకు మునుపెప్పుడూ కనిపించని రోల్లో ప్రభాస్ ను మనకు ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయొద్దంటూ.. నెట్టింట ప్రభాస్ ను రెక్వెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . 

ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అవసరమా.. అంటూ.. డైరెక్ట్‌ గానే కామెంట్ చేస్తున్నారు.

మరికొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్.. అలా కామెంట్‌ చేయకండని.. మారుతీ సెన్సబుల్ డైరెక్టర్‌.. ప్రభాస్ కు తప్పకుండా హిట్టు పడేలా చేస్తారంటూ.. డైరెక్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు.

ఈ స్టేట్మెంట్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.