వర్షం సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటి నుండి త్రిషకి స్టార్ డమ్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత  స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని దూసుకుపోయింది.

తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు అయిన సందర్భంగా వర్షం సినిమాను రిలీజ్ చేశారు.

ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో దుమ్మురేప్పింది. అయితే ఇప్పుడు త్రిష పై ప్రభాస్ ఫ్యాన్స్ గరం గరం గా ఉన్నారు.

వర్షం సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో పై త్రిష స్పందిస్తూ.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ రాసుకొచ్చింది త్రిష.

అయితే త్రిష ప్రభాస్ గురించి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కానీ చెప్పకపోవడం. కనీసం ప్రభాస్ ను ట్యాగ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కొంతమంది హార్ట్ అయ్యారని తెలుస్తోంది.