టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ప్రభాస్‌ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే

ప్రభాస్‌ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడాని ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

ప్రభాస్‌-అనుష్కలు పెళ్లిపై అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి

ఇంతలో ప్రభాస్‌-కృతి సనన్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ వీరి డేటింగ్‌ రూమర్స్‌కు తాజాగా తెరలేచింది

వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఫిక్సైనట్లు బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది

కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారనేది సదరు ట్వీట్‌ సారాంశం

ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపండంటూ నెటిజన్లు మండిపడుతున్నారు