ఆదిపురుష్ కలెక్షన్స్ తో ప్రభాస్ నయా రికార్డ్.
బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ సంచలనం సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైన ఈ సినిమా 6200 థియేటర్లలో విడుదల చేశారు.
ఓంరౌత్ డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా విభిన్న టాక్ వినిపించింది.
తొలిరోజే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది.
ఫస్ట్ డే ఏకంగా రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
మొదటి రెండు రోజులు కూడా ఆదిపురుష్ టికెట్స్ సైతం భారీగా అమ్ముడుపోయాయని..
ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఆదిపురుష్ సులభంగా రూ. 200 కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఆదిపురుష్ చిత్రానికి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని చెప్పొచ్చు.