నందమూరి బాలకృష్ణకు ఆవేశం, నోటిదురుసు ఎక్కువ అని తెలిసిన విషయమే.
అయితే తాజాగా బాలయ్యపై నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో 'బాలకృష్ణ ఓ ఇద్దరిని తుపాకీతో టపీటపీమని కాల్చాడు. ఎవరైనా మంచివాళ్లు కాలుస్తారా? సైకోలు కాలుస్తారా?
మనకు చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి. బాలకృష్ణకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లొచ్చు. వాళ్ల మీద కేసులు పెట్టొచ్చు.
చేతిలో గన్ ఉంది కాల్చేశాడు. కాల్చిన తర్వాత ఒక్కరోజైనా జైల్లో ఉన్నాడా? నేనిద్దరిని కాల్చితే పోసాని అమాయకుడని వదిలేస్తారా? కొట్టి జైల్లో వేస్తారు.
మరి నువ్వు ఇద్దరిని కాల్చావు. నిన్నెవరూ ఏం చేయలేకపోయారు. ఎవరు మానసిక రోగి? ఎవరు క్రూరుడు? అనేది తెలిసిపోతుంది.
మీ ఇంట్లో రాత్రి నీ కళ్లముందే వాచ్‌మెన్ చనిపోయాడు. పొద్దున్నే డెడ్‌బాడీని దాటుకుంటూ షూటింగ్‌కు వెళ్లిపోయావు.
ఎవరైనా అడిగారా? ఎవరు సైకో అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి' అని పోసాని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.