పూనమ్‌ కౌర్..! చేసింది తక్కువ సినిమాలే అయినా.. యూత్ పై ఈమె ఇంపాక్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది.

అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్‌ కూడా.. ఎక్కువే ఉంటుంది.

ఇక తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అప్డేట్స్ తో మాత్రమే కాదు.. తన కామెంట్స్ తో కూడా.. నెట్టింట రీసౌండ్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.

అలా తాజాగా అమ్మాయిల బట్టలపై అతిగా మాట్లాడే వారిపై సీరియస్ అయింది. సీరియస్ అవ్వడమే కాదు వారందరినీ ఏకి పారేసింది.

ఆడవాళ్లు వేసుకునే డ్రస్సులు కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు.

ముందుగా ఈ విషయం గురించి మాట్లాడేవారు నిండుగా దుస్తులు ధరించిన మహిళలపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించాలి. నేను కూడా నాకు నచ్చిన విధంగా నాకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరిస్తాను.

నేను బురుఖా వేసుకుంటాను, చీర కట్టుకుంటాను అలాగే బీచ్ కి వెళ్తే బికినీ వేసుకొని తిరుగుతాను.నాకు నచ్చిన, కంఫర్ట్ గా ఉన్న బట్టలే వేసుకుంటా..”అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.