గతేడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో హిందీలో రణవీర్ సింగ్ కి జంటగా నటించిన ‘సర్కస్’ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
అప్పటినుండి అమ్మడి కెరీర్ అనుమానంలో పడినప్పటికీ.. చేతిలో మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ సినిమాలు ఉండటంతో కాస్త ధైర్యంగా ఉంటోంది
అందులోను సల్మాన్ సినిమా అంటే.. చెప్పలేం గాని, తెలుగులో మహేష్ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ నే నమ్ముకొని ఉందట బ్యూటీ.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే.. స్టార్డమ్ వచ్చాక రెమ్యూనరేషన్ అనేది కొంచం ప్రెస్టేజియస్ విషయం అవుతుంది.
వరుసగా నాలుగు ప్లాప్స్ పడ్డాక కూడా రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా ప్రవర్తిస్తే అవకాశాలు వస్తాయో రావో చెప్పలేం.
అలాగని వేరే ఆప్షన్ లేకపోలేదు. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పుడైతే మహేష్, సల్మాన్ సినిమాలు తప్ప పూజ చేతిలో ఏం లేవు. సో.. చూడాలి మరి త్వరలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనుందేమో!