మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా  తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా  పూజా హెగ్డే నటిస్తోంది.

మహేశ్‌ - పూజా మహర్షి లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్‌ సక్సెస్‌ను సొంతం చేసుకొంది. దీంతో మహేశ్‌ 28వ సినిమాలోనూ ఈ బుట్టబొమ్మకు అవకాశం వచ్చింది.

పూజా మాట్లాడుతూ ఇందులో తన పాత్ర ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది.

పూజా మాట్లాడుతూ ఇందులో తన పాత్ర ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది.

కొత్తగా కనిపిస్తానని చెప్పింది. ఇక మహేశ్‌ గురించి మాట్లాడుతూ అద్భుతమైన నటుడంటూ పొగడ్తల వర్షం కురిపించింది. 

ప్రత్యేకించి మహేశ్‌ వాయిస్ మాడ్యులేషన్‌కు తాను ఫిదా అయినట్లు చెప్పింది.మహేశ్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని గెటప్‌లో చూస్తారన్నది.

అలాగే గతంలో తనతో కలిసి నటించిన ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌ గురించి పూజా హెగ్డే మాట్లాడింది. తారక్‌కు తెలుగు భాషపై పట్టు ఉందని ఎంత పెద్ద డైలాగునైనా వెంటనే చెప్పేస్తాడని తెలిపింది