`ఒక లైలా` కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పూజా హెగ్డే.
కెరీర్ ఆరంభంలో వరస ప్లాపులు ఎదుర్కొన్నా ఆ తర్వాత `దువ్వాడ జగన్నాథం`తో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
బ్రేకుల్లేని హిట్స్ తో స్టార్ హోదాను సంపాదించుకుంది. టాలీవుడ్ బుట్టబొమ్మగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
అయితే గత ఏడాది మాత్రం పూజా హెగ్డేకి ఏ మాత్రం కలిసి రాలేదు. ఈమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` లో నటిస్తోంది.
పూజా హెగ్డే కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మన బుట్టబొమ్మ మనసు పెళ్లిపై మళ్లిందట.
ఆల్రెడీ పూజాకు 32 ఏళ్ళు. ఈ నేపథ్యంలోనే త్వరగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు పూజా పై ఒత్తిడి పెడుతున్నారట.
దీంతో పేరెంట్స్ కోరిక మేరకు పూజా హెగ్డే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లాడబోయే వరుడు మరెవరో కాదు ఆమె చిన్ననాటి స్నేహితుడే అని అంటున్నారు.
పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.