కుందవై అనగానే ఠక్కున గుర్తొచ్చేది నటి త్రిషనే.

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకటి యువరాణి కుందవై.

మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం. దివంగత ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవలకు వెండి తెర రూపం ఇది.

రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కాగా రెండవ భాగం ఈనెల 28వ తేదీన భారీ అంచనాల మధ్య తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

నాలుగు పదుల వయసులో త్రిష కుందవై పాత్రలో రాజసాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి.

తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా త్రిష పోషించిన కుందవై పాత్రకు ఇతర పేర్లు ఏమిటి? అనే కాంటెస్ట్‌తో చిత్ర యూనిట్‌ ఒక వీడియోను విడుదల చేశారు.

దీంతో అభిమానులు రకరకాల పేర్లతో సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళాల్లని నిర్ణయించారు.