మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో పొన్నగంటి కూరమొక్క కూడా ఒకటి
ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది అమరాంథేసి జాతికి చెందిన ఒక ఆకుకూర
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది
ఈ మొక్క ఆకులు ఆకు పచ్చ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, సన్నగా ఉంటాయి
దీనికి విత్తనాలు వుండవు కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు. ఈ ఆకుకూరల లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు
బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే చాలా మంచిది
తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు దీని రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది
దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది