ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అందుకునే జీతం ఎంతో తెలుసా ??

TV9 Telugu

19 June 2024

పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూ, మరొక పక్క రాజకీయాల్లో రాణిస్తున్న నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. హరిహర వీర మల్లు, ఓజి సినిమాలు రెండు భాగాలుగా మరియు ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతున్నాయి.

అయితే, గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, ఎన్నికల ప్రచార పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఎప్పుడు అనే విషయం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పాల్గొని గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ, ఎమ్మెల్యే కి ఇచ్చే సాలరీ తీసుకుంటాను అని చెప్పారు.

ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు సుమారు ఒక లక్ష 75 వేల రూపాయలు వస్తాయి. ఉపముఖ్యమంత్రిగా ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి.

అంతకుముందు క్వార్టర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేకపోవడంతో, 50000 రూపాయలు హౌస్ రెంట్ అలవెన్స్ అదనంగా ఇస్తున్నారు.

వీటితో పాటు, ఫోన్ సదుపాయాలు, సిట్టింగ్ అలవెన్స్, వారి అవసరాలకు తగ్గట్టుగా వన్ ప్లస్ వన్ లేదా టు ప్లస్ టు గన్ మెన్ సిబ్బందిని అందిస్తున్నారు.