మనలో కొందరు పెళ్లిళ్లు, వేడుకల్లో బంగారాన్ని ధరించే ముందు వాటిని పాలిష్ చేసేందుకు స్వర్ణకారుల వద్దకు వెళుతుంటారు.
స్వర్ణకారులు తమ నగలలోని బంగారాన్ని తీసివేస్తారేమోనన్న భయంతో కొందరు తమ నగలను దుకాణాల్లో క్లీన్ చేసుకోకుండా అలాగే వాడేస్తుంటారు.
కాబట్టి, ఈ ప్రమాదాలన్నింటినీ నివారించడానికి ఇంట్లో మీ బంగారాన్ని పాలిష్ చేయడం మంచిది కాదా.
మీ ఇంట్లో ఉన్న బేకింగ్ సోడాతో బంగారాన్ని ఇంట్లో పాలిష్ చేసుకోవచ్చు.
బేకింగ్ సోడాను సాధారణంగా వంటలో ఉపయోగిస్తారు.
బేకింగ్ సోడా వంటల్లో మాత్రమే కాదు.. ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడాతో నగలను శుభ్రం చేసుకోవచ్చు.
ఇందుకోసం మీరు 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కరిగించి పేస్ట్ చేసుకోవాలి.
అందులో మీ నగలను అరగంట నానబెట్టండి. తర్వాత శుభ్రం చేయడానికి టూత్ బ్రష్, స్పాంజితో మెల్లగా రుద్దండి.
అంతే మీ బంగారం తల తల మెరిసిపోతుంది.