ఇటీవల టాలీవుడ్ లో రీరీలీజ్ ల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్నాయి.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ దేశముదురు సినిమాను రీ రిలీజ్ అయ్యింది.
ఈ నెల 8న బన్నీ బర్త్ డే.. ఆ సందర్భంగా బన్నీ దేశముదురు సినిమాను ఈ నెల 6న రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా సందర్భంగా ఫ్యాన్ యమా సందడి చేశారు.
దేశముదురు సినిమా సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్స్ లో హంగామా చేశారు.
ప్రస్తుతం పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ దేశముదురు సినిమాకు భారీగా తరలి వచ్చారు.
కాగా ఓ ధియేటర్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.ఏకంగా థియేటర్ లో టపాసులు పేల్చి హల్ చల్ చేశారు.
హైదరాబాద్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేశారు. థియేటర్ లోపల టపాసులు పేల్చి రచ్చ చేశారు ఫ్యాన్స్.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి షోను ఆపేశారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్వీట్ చేశారు.
దయచేసి థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఫ్యాన్స్‌ను కోరారు..