ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాతృమూర్తి హీరా బెన్ పటేల్ (100) కన్నుమూశారు
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు.
చాలా చిన్న వయసులోనే దామోదరదాస్ ముల్చంద్‌ను వివాహం చేసుకున్నారు హీరా బెన్.
ఆమెకు ప్రధాని మోడీతో సహా మొత్తం 5 గురు కుమారులు.
వాసంతీ బెన్ హస్ముఖ్‌లాల్ మోదీ కుమార్తె.
2016లో ఏటీఎం క్యూలో నిలబడి మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతునిచ్చారు హీరా బెన్.
99 ఏళ్ల వయసులోనూ క్యూలో నిలబడి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారామె.
ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది.