ఐపీఎల్‌లో బ్యాడ్‌లక్ ప్లేయర్స్ వీరే.. లిస్టులో కోహ్లీతో మరో నలుగురు భారత్‌ నుంచే..

ఈ ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ 99 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. SRHపై 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

శిఖర్ ఈ ఇన్నింగ్స్ IPL 2023లో అతిపెద్ద వ్యక్తిగత ఇన్నింగ్స్. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా.

శిఖర్ కంటే ముందు కూడా ఐపీఎల్‌లో 8 సార్లు 99 పరుగుల వ్యక్తిగత స్కోర్లు నమోదయ్యాయి. సురేష్ రైనా తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

సురేశ్ రైనా ఐపీఎల్ 2013లో 99 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. SRHపై ఛేజింగ్‌లో అతను CSKకి విజయాన్ని అందించాడు.

ఐపీఎల్ 2013లోనే విరాట్ కోహ్లీ 99 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 99 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.

ఐపీఎల్ 2019లో మళ్లీ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ సీజన్‌లో పృథ్వీ షా 99 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఐపీఎల్ 2019లో క్రిస్ గేల్ కూడా ఇదే స్థాయిలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరపున అతను 99 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

IPL 2020లో, క్రిస్ గేల్ మరోసారి ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోయాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

IPL 2020లో, ఇషాన్ కిషన్ కూడా 99 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. RCBపై 57 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ 2021లో 99 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు.