అరటి మొక్కను ఆఫీస్ లో ఉంచడం వలన విష్ణువు ఆశీర్వాదంతో సురక్షితంగా ఉంటుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది
అరటి మొక్కను తూర్పు ముఖంగా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి
ఇండోర్ మొక్కలుగా ఆఫీస్ లో లిల్లీ మొక్కలను ఉంచుకోవచ్చు. ఈ మొక్కలు ప్రతికూల పరిస్థితులను తగ్గించడంలో సహాయపడతాయి
స్వీయ నియంత్రణను కొనసాగించడంలో సహాయపడతాయి. అందుకే లిల్లీ మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు
మనీ ప్లాంట్ ను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా, ఆఫీస్ లో ఉంచడం వలన మీ జీవితాల్లో శ్రేయస్సు , సంపద లభిస్తుంది
మనీ ప్లాంట్ ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది
స్నేక్ ప్లాంట్ కు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు స్నేక్ ప్లాంట్ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది
వాతావరణంలోని గాలిని శుద్ధి చేస్తుంది. అందుకనే ఈ మొక్కను మీ ఆఫీసు డెస్క్‌పై ఉంచడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు