చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది
ఈ ఊరు పూర్వం బుద్ద రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్ధమని అంటారు
పాదగయ తీర్ధం వద్ద గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం
పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది
గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది
ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు
ఈ ఆలయంలో అస్తోదశ శక్తీపీఠాల్లో ఒకటైన పురూహూతికా అమ్మవారి ఆలయం ఉంది
త్రిగయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం పితృ ముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది
ఇక రైలు మార్గంగా ద్వారా చేసుకోవాలంటే పిఠాపురం లేదా సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంది
సామర్లకోట రైల్వే జంక్షన్ నుండి పిఠాపురం కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే