సినిమాల్లో విలన్‌గా నటించిన నిజ జీవితంలో మాత్రం అందరిచేత రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూసూద్‌.

కరోనా, లాక్‌డౌన్‌లో చాలామంది పేదప్రజలకు సాయం అందించారు సోనూసూద్.

లాక్‌డౌన్‌ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చారు.

అలాగే ఆపదలో ఉన్న చాల మందికి ఆర్థిక సాయం చేసారు.

ఎంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా  చేయించారు సోనూసూద్.

ప్రస్తుతం ఒక స్వచ్ఛంధ సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు అయన.

తాజాగా సోనూ సూద్ ఫాన్స్ మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో తుకోజీరావు పవార్ స్టేడియంలో 2500 కిలోల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు.

ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని తీర్చిదిద్దిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.