వేరుశెనగ గింజలు(పల్లీలు) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

వీటిలో ఐరన్, విటమిన్ ఇ, జింక్(Zink), పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయి

ఈ వేరుశెనగలను మాత్రం మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేరు శెనగలను అస్సలు తినొద్దు. పొరపాటున గానీ వీటిని తీసుకున్నారో TSH లెవెల్ పెరుగుతుంది

అలెర్జీ సమస్య ఉన్నట్టైతే మీరు వేరుశెనగలను తింటే చర్మంపై దద్దుర్లు, కాళ్లలో దురద, పెదవులపై వాపు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది

పల్లిలలో ఉండే కొన్ని మూలకాలు కాలేయంపై చెడు ప్రభావం చూపుతాయి. కాలేయ సమస్య ఉన్న వాళ్లు వేరువెనగలను తీసుకోకపోవడమే ఉత్తమం

కీళ్ల నొప్పులున్న వారు పల్లిలు మొత్తమే తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే లెక్టిన్ అనే పదార్థం నొప్పులను మరింత పెంచుతాయి

ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు, బరువు తగ్గాలనుకున్న వాళ్లు వేరుశెనగలను మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు