ప్రకృతి మనకు సహజంగా ఇచ్చిన ఆహార పదార్థాల్లో ఉసిరి ఒకటి. మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే ఉసిరి ఎక్కువగా కనిపిస్తుంది
ఇందులో ఉండే ఔషధ గుణాలు మనకు తెలియజేయడానికి మన పూర్వీకులు కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం ఆచారంలో భాగం చేశారు
ఉసిరిలో ఉండే విటమిన్ సి, పాలీఫెనాల్స్, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ వంటి పోషకాలు శరరీరానికి ఎంతో మేలు చేస్తాయి
ఇదిలా ఉంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఉసిరితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉసిరి మేలు కంటే కీడే చేస్తుంది
డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు ఉసిరి తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే వారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలి. వీటివల్ల కాలేయానికి హాని కలిగించే ఎంజైమ్‌ల స్థాయి పెరుగుతుంది
సాధారణంగా ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పోటు తగ్గుతుతుంది. కాబట్టి లో బీపీతో బాధపడేవారు ఉసిరికి దూరంగా ఉండడమే మేలు
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవారు ఉసిరిని తీసుకునే ముందు వైద్యుల సలహాలను కచ్చితంగా తీసుకోవాలి
సహజంగా ఉసిరి చలువు చేస్తుంది. కాబట్టి జలుబు తగ్గే వరకు ఉసిరి తినకపోవడమే మంచిది