బరువు తగ్గాలనుకునేవారు తినకూడనివి
బరువు తగ్గాలనుకునేవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదో స్పష్టతతో ఉండాలి.
చక్కెర ఎక్కువ ఉండే పానీయాలు తాగకూడదు. స్వీట్ సోడాలు కూడా తాగకూడదు. చక్కర పానీయాలు ఎక్కువ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
తాజా పండ్లరసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్యాకింగ్ చేసిన లేదా నిల్వ ఉంచిన పండ్ల రసాలు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
బరువు తగ్గాలనుకునేవారు బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. కాల్చిన ఆహారాల ముఖ్యమైన పోషకాలు తక్కువుగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువుగా ఉంటుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు వేయించిన ఆహారాల్లో అధిక కేలరీలు, అనారోగ్య కొవ్వు పదార్థాలు ఎక్కువుగా ఉంటాయి.
మద్యపానీయాలకు దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వీటిలో అధిక చక్కెర శాతం ఉంటుంది.
శుద్ధి చేసిన పిండిలో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఇవి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది.
తీపి ఎక్కువుగా ఉండే చాక్లెట్లను తినకూడదు. డార్క్ చాక్లెట్లను మితంగా తినడమే మేలు.