ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి నుంచి అసలు నిజాలు ఇప్పటివరకు బహిర్గతం కాలేదు

తరచుగా మానవులమైన మనకు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు, మనం దానిని అద్భుతంగా లేదా శాపంగా భావిస్తాం

ఇది ఇలాంటి వాటిలో చేరింది. ఇక్కడ ఉన్న ఒక గ్రామంలోని ప్రజల ఎత్తు కేవలం 3 అడుగులకే పరిమితమైంది

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్జీ గ్రామంలోని మొత్తం జనాభాలో యాభై శాతం మంది మరుగుజ్జులు

వారి మొత్తం పొడవు 2 అడుగుల నుంచి మూడు అడుగుల వరకు ఉంటుంది

ఇక్కడ పిల్లలు ఎత్తు ఐదు నుంచి ఏడేళ్ల వరకు బాగా పెరుగుతుంది. కానీ, ఆ తర్వాత పిల్లల ఎత్తు ఒక్కసారిగా ఆగిపోతుంది

ఈ గ్రామం చుట్టూ నివసించే ప్రజలు ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉందని నమ్ముతారు

యాంగ్సీ పురాతన కాలం నుంచి శాపగ్రస్తమైన గ్రామం అనే నమ్మకం కూడా ఉంది. దీని ప్రభావం నేటికీ ఆ గ్రామంపై కనిపిస్తోంది

జపాన్ దేశం చైనా వైపు విడుదల చేసిన విష వాయువు ప్రభావంతో, ఈ గ్రామంలో మరుగుజ్జు వ్యాప్తి చెందిందని కూడా కొందరు భావిస్తున్నారు

ఈ గ్రామంలోని మట్టిలో పాదరసం ఎక్కువ మోతాదులో ఉందని దీనివల్లే ఇక్కడి ప్రజల ఎత్తు పెరగడంలేదని కొందరు భావిస్తున్నారు