పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ పూర్తి కానుంది

ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ‘వినోదాయ సిథం’ రీమేక్‌  షూటింగ్ ప్రారంభించుకుంది

కాగా ఎప్పుడు పవన్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది

ఏప్రిల్‌ 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం

దానికోసం ఆర్ట్  డైరెక్టర్ ఆనంద్‌ సాయి నేతృత్వంలో హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను  హరీష్‌ సిద్ధం చేయిస్తున్నారు

చిత్ర తొలి షెడ్యూల్‌ మొదలు కానున్న సెట్‌కు సంబంధించిన ఫొటోలను శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రబృందం