ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ రెండు  సినిమాలు చిత్రీకరణలో బిజీ ఉన్నారు

ఇటీవలే మరో రెండు చిత్రాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి

వాటిలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది

దీనికోసం శరవేగంగా సన్నాహాలు  జారుతున్నాయి

హరీష్‌శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది

ఏప్రిల్‌ తొలి వారంలో ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి

అందుకోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆనంద్‌సాయి సెట్‌ని తీర్చిదిద్దే పనిలో పడ్డారు

‘గబ్బర్‌సింగ్‌’ లాంటి విజయం తర్వాత పవన్‌కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కాంబోలో వస్తున్న చిత్రమిది