నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్‌ షో ఊహించిని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ ఛాట్‌ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చి బాలయ్యతో తమ జీవిత విశేషాలను పంచుకున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 ఇది ఇలా ఉంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో పవన్ సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది.

 తాజాగా ఈ మోస్ట్‌ అవైటెడ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా పవన్ కళ్యాణ్ తో జరిగే ఈ ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అటు నందమూరి, ఇటు పవన్ ఫ్యా్స్ వేయికళ్లతో ఈ ఎపిసోడ్‌ కోసం వేచిచూస్తున్నారు.

మాస్‌ ఫాలోయింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఏం మాట్లాడుకుంటారు? పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఈ ఎపిసోడ్ సీజన్ చివరిది కావడంతో.. 'లాస్ట్ పంచ్ పవన్‌దైతే ఆ కిక్కే వేరప్పా' అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.