పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు.

 ఈ మధ్యనే హరిశంకర్, సుజిత్ ల సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. హరిశంకర్ తో చేయబోయే సినిమా ‘తేరి’ రీమేక్ అని తెలుస్తుంది.

ఇక సుజిత్ దర్శకత్వంలో చేయబోయేది ‘ఓజి’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా కావడం విశేషం.

నిజానికి దీనికంటే ముందే తమిళ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేకులు నటిస్తానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నాడు.

 కారు యాక్సిడెంట్ లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతం’ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్.

తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించనున్నారు.

 పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకుముందు గోపాల గోపాలలో మోడ్రన్ శ్రీకృష్ణుని పాత్ర చేశారు.