పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు

ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీని పూర్తిచేసే పనిలో ఉన్నరు పవన్

ఈ చిత్రం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించనున్నారు

కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న తేరి మూవీకి రీమేక్ ఇది

ఈ చిత్రంలో లో పవన్ లెక్చరర్ గా కనిపించనున్నారు

తేరి మూవీలో విజయ్ కూతురిగా.. సీనియర్ నటి మీనా కూతురు బేబీ నైనిక నటించింది

ఇక తెలుగులో ఈ చిన్నారి పాత్ర కోసం చాలామందిని వెతికి చివరికి అల్లు వారసురాలిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది

ఈ విషయమై బన్నీతో సంప్రదింపులు జరపగా పవన్ సినిమా అనగానే అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం

మెగా కాంపౌండ్ లోనే పెరుగుతున్న చిన్నారి కాబట్టి తండ్రి కూతుళ్లుగా సెట్ అవుతారని అభిమానులు సైతం అంటున్నారు

కాగా దీనికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది