సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా  ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

టీజీ విశ్వప్రసాద్‌ జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

తమిళ చిత్రం వినోదయ సీతం చిత్రానికి రీమేక్ ఈ చిత్రం.

ఇదిలా ఉంటె తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ చిత్రానికి  ‘బ్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.

ఈ మేరకు గురువారం టైటిల్‌తో కూడిన ఓ మోషన్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ మేకర్స్.

ఆ మోషన్‌ పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌తో పవన్‌ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

‘‘కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం’’ అంటూ సాగె అందులో నేపథ్య గీతం ఆసక్తి కరంగా ఉంది.

ఈ చిత్రంలో పవన్‌ దేవుడిగా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.