పవన్‌ కల్యాణ్‌ ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’.

వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రోహిణి తిదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది.

పవన్‌, సాయితేజ్‌లపై ఈ వారంలో ఓ పబ్‌ సాంగ్‌ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సాంగ్‌లో బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాను ఆడిపాడనున్నట్లు సమాచారం.

దీని కోసం ఓ పబ్‌ను కూడా సిద్ధం చేశారట మూవీ మేకర్స్