చాలాఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న షారుఖ్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది పఠాన్

జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించడమే కాకుండా

అత్యధిక వసుళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించి, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

వరుసగా ఆరు రోజులు 100 కోట్ల గ్రాస్ కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటిటి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.

కాగా ఈ సినిమా మార్చి 25 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.