చూపు తిప్పుకోనివ్వని అందం, అందుకు తగ్గట్లే అభినయంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు పరిణీతి చోప్రా.
2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ భల్’ మూవీతో తెరంగేట్రం చేశారు పరిణీతి.
ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పరిణీతి డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
ఒక రాజకీయ నాయకుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో ముంబైలో కెమెరాలకు చిక్కింది పరిణీతి.
సిటీలోని ఓ రెస్టారెంట్లో నుంచి బయటకు వస్తుండగా వీళ్లిద్దరూ మీడియా కెమెరాల కంటికి చిక్కారు.
దీంతో డేటింగ్ రూమర్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందనేది పరిణీతి, రాఘవల్లో ఎవరు ఒకరు క్లారిటీ ఇచ్చే దాకా తెలియదు.