బొప్పాయి ఐస్ క్యూబ్స్ చేయడానికి సగం గిన్నె బొప్పాయి పేస్ట్, 3 నుంచి 4 చెంచాల రోజ్ వాటర్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ తీసుకొని బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ట్రేలో ఉంచి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. 2 గంటలు అలాగే వదిలేయండి. ఇప్పుడు బొప్పాయి ఐస్ క్యూబ్ సిద్ధంగా ఉంటుంది.

ఇప్పుడు బొప్పాయి ఐస్ క్యూబ్స్ వల్ల చర్మానికి కలిగే ప్రయాజనాలు ఏంటో తెలుసుకుందాం.

బొప్పాయి ఐస్‌ క్యూబ్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేస్తే ఇది చర్మంపై మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

బొప్పాయి ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేస్తే చర్మానికి లోపలి నుంచి తేమ అందించి చాలా కాలం పాటు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

బొప్పాయి ఐస్ క్యూబ్‌ను అప్లై చేయడం ద్వారా ముఖంపై మచ్చలను తొలగించవచ్చు.

బొప్పాయి ఐస్ క్యూబ్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేస్తే చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బొప్పాయి ఐస్ క్యూబ్‌ను అప్లై చేయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు కూడా సులభంగా తగ్గుతాయి.

ముఖంపై ఎండ ప్రభావం, టానింగ్ సమస్య ఉంటే మీరు బొప్పాయి ఐస్‌క్యూబ్‌ను ఉపయోగించవచ్చు.

బొప్పాయి ఐస్ క్యూబ్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేస్తే చర్మంపై సహజమైన మెరుపు కూడా వస్తుంది.