చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ప్లేయర్.. తొలి బౌలర్‌గా..

ఆఫ్గానిస్తాన్‌తో షార్జా వేదికగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో పాక్ టీం వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది.

తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన ఆఫ్గానిస్థాన్ టీం.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

కాగా, పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాదాబ్‌ ఖాన్‌ ఓ రికార్డ్ నెలకొల్పాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడిన షాదాబ్‌ ఖాన్‌ 101 వికెట్లు పడగొట్టాడు.

ఈ విషయంలో పాక్ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది (98) దాటేశాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన జాబితాలో షాదాబ్‌ ఖాన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

తొలి స్థానంలో న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ(134 వికెట్లతో) ఉన్నాడు.