పాక్ గడ్డపై 2 మ్యాచ్‌లే.. పీసీబీ చైర్మన్ ఫైర్..

మొత్తంగా ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుందంట.

ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది.

దీనిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆమోదించింది.

4 మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో, మిగిలిన 9 శ్రీలంకలో జరగనున్నాయి.

పాకిస్తాన్ స్వదేశంలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహిస్తుంది.

దీనిపై పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

మొత్తంగా ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుందంట.

ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భారత జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి BCCI నిరాకరించింది.

ఆ తర్వాత PCB ఒక హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఆమోదం పొందింది.

భారత జట్టు తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుండగా, మిగతా జట్లు తమ షెడ్యూల్ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో ఆడనున్నాయి.

ఆసియా కప్ 2023 ఆగష్టు 31 నుండి సెప్టెంబర్ 17, 2023 వరకు జరుగుతుంది.

టోర్నమెంట్‌లో రెండు గ్రూపులు ఉంటాయి.

ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి.

సూపర్‌ఫోర్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడి ట్రోఫీని కైవసం చేసుకుంటాయి.