చెత్త రికార్డుల్లో సూర్యను దాటేసిన పాక్ ప్లేయర్.. అదేంటో తెలుసా?

ఈ పాకిస్థానీ ఆటగాడు డకౌట్లలో భారత ఆటగాడు సూర్యకుమార్‌ను వెనక్కునెట్టాడు.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అబ్దుల్లా షఫీక్‌ తన పేరిట ఓ చెత్త రికార్డు సృష్టించాడు.

23 ఏళ్ల అబ్దుల్లా షఫీక్ ఈ మ్యాచ్‌లో ఫజల్‌హాక్ ఫరూఖీ బంతిపై పరుగులు చేయకుండానే ఔటయ్యాడు.

అబ్దుల్లా షఫీక్ వరుసగా 4 టీ20 ఇంటర్నేషనల్స్‌లో సున్నాకి ఔట్ అయిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి టీ20, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లలో అబ్దుల్లా సున్నా వద్ద ఔటయ్యాడు.

జింబాబ్వేతో జరిగిన టీ20లో అబ్దుల్లా అరంగేట్రం చేసి 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అప్పటి నుంచి వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో డకౌట్ అయ్యాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో, భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3సార్లు గోల్డెన్ డక్‌లుగా వెనుదిరిగాడు.

అయితే డకౌట్ల విషయంలో అబ్దుల్లా షఫీక్ సూర్యకంటే ముందున్నాడు.