టీ20ల్లో పాక్ బౌలర్ సరికొత్త రికార్డ్.. టాప్ 5లో టీమిండియాకు నో ప్లేస్..

పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ టీ20 క్రికెట్‌లో తన పేరిట ప్రత్యేక విజయాన్ని సాధించాడు.

పాక్ నుంచి టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 400 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్టులో ఆరో బౌలర్‌గా నిలిచాడు.

డ్వేన్ బ్రావో టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 614 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో 496 వికెట్లతో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో 474 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్ 466 టీ20 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 436 టీ20 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.