TV9 Telugu
ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రభాస్ సలార్.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
14 April 2024
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుమారు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే పలువురు తారలు కీలక పాత్రల్లో తళుక్కుమన్నారు.
మొదట థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన సలార్ ఆ తర్వాత ఓటీటీలోనూ దుమ్ము రేపింది. రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.
లా థియేటర్లు, ఓటీటీల్లో అదరగొట్టిన ప్రభాస్ సలార్ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు వస్తోంది.
సలార్' మూవీ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 21న ఈ సినిమా టెలికాస్ట్ కానుందని టాక్.
ఆదివార సాయంత్రం 5.30 గంటలకు సలార్ సినిమా ప్రసారం కానుందని సమాచారం. మరో రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లో దుమ్ము రేపిన 'సలార్' బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
కాగా ప్రస్తుతం 'సలార్' మూవీ నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..