కుక్కపై ప్రేమతో ఒలింపిక్ పతకం సాధించిన ప్లేయర్

TV9 Telugu

9 August 2024

ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుడి కల. ఈసారి కూడా పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల కోసం గట్టి పోటీ నెలకొంది. 

పారిస్ ఒలింపిక్స్ 2024

స్వర్ణ పతకాలు సాధించిన ఆటగాళ్లలో నెదర్లాండ్స్ స్విమ్మర్ షారన్ వాన్ రువెండాల్ కూడా ఉంది. అయితే ఈసారి ఆమె మెడల్ వెనుక కథ తెలిసి అందరూ ఎమోషనల్ అయ్యారు.

పతకం బ్యాక్ స్టోరీ

రువెండాల్ 10 కిలోమీటర్ల మారథాన్ స్విమ్మింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తర్వాత ఆమె చాలా ఎమోషనల్‌గా కనిపించింది. ఈ పతకాన్ని తన కుక్కకు అంకితమిచ్చింది.

కుక్కకు అంకితం

పారిస్ ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు మరణించిన షారన్ వాన్ రౌవెండాల్ కుక్కకు రియో అని పేరు పెట్టింది. ఈ సంఘటన తర్వాత ఆమె చాలా నీరసించింది. 

కుక్క మరణంతో

2016లో బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత షారన్ వాన్ రువెండాల్ తన కుక్కకు రియో అని పేరు పెట్టింది.

రియో అని పేరు పెట్టింది 

పతకం గెలిచిన తర్వాత రువెండాల్ మీడియాతో మాట్లాడుతూ, రియో అంత్యక్రియలకు మూడు రోజుల తర్వాత టాటూ వేయించుకున్నాను అంటూ ఎమెషనల్ అయింది.

ఎమోషనల్

నేను మనస్పూర్తిగా కుక్క కోసం ఈత కొట్టాను. ఈ పతకం కూడా కుక్క కోసమే గెలిచాను అంటై భావోద్వేగం చెందింది.

పతకం గెలిచిన తర్వాత

రువెండాల్ చేతిపై రియో టాటూ వైరల్‌గా మారింది. గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత మొదటగా ముద్దుపెట్టుకున్నది టాటూనే.

టాటూ వైరల్