TV9 Telugu

14 February 2024

తెలుగు హీరోలు , సినిమాలపై ఇంట్రుస్టింగ్ కామెంట్ చేసిన పీవీ సింధు.

2 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన మన తెలుగుబిడ్డ పీ వీ సింధు గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనే చెప్పాలి.

తాజాగా పీవీ సింధు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బ్యాడ్మింట‌న్ వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గించుకోవడానికి సినిమాలు చూస్తానని తెలిపిన సింధు.. టాలీవుడ్ హీరోస్ గురించి మాట్లాడింది.

విజయ్ దేవరకొండ నటించిన అన్ని సినిమాలు తనకు నచ్చవు , కొన్ని సినిమాలు మాత్రమే తనకు ఇష్టం అని తెలిపింది సింధు.

అలాగే తనకు చిన్నప్పటి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ప్రభాస్ తన క్రష్ అని తెలిపింది పీవీ సింధు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపింది సింధు. కొన్ని చిన్న సినిమాలు కూడా ఇష్టమని తెలిపింది.

ప్రతి హీరో తన సినిమా హిట్ అవుతుందనే నెలలు తరబడి షూటింగ్ చేస్తారు. కానీ వాటి రిజల్ట్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది.

అందుకే వారి కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అని తెలిపింది పీవీ సింధు మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.