ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్.. కట్‌చేస్తే.. రెస్టారెంట్‌లో సర్వర్ డ్యూటీ

TV9 Telugu

20 August 2024

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా 18 ఏళ్ల చైనా క్రీడాకారిణి ఝౌ యాకిన్ రజత పతకాన్ని సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్లేయర్ జిమ్నాస్టిక్స్ బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్‌లో ఈ పతకాన్ని గెలుచుకుంది.

మెడల్ ప్రదానోత్సవం సందర్భంగా పోడియంపై పళ్లతో కొరికే సంప్రదాయం గురించి తెలియక షాక్ తిన్న వీడియో వైరల్‌గా మారింది. 

ఆమె పతకం గెలిచిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి జౌస్ రెస్టారెంట్‌లో పనిచేస్తుందనే వార్తలతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. జౌ యాకిన్ చైనాలోని హెంగ్‌యాంగ్ నగరంలో నివాసి.

ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం సాధించాలనేది ప్రతి క్రీడాకారుడి కల. కేవలం 18 సంవత్సరాలకే ఈ ఘనత సాధించింది.

అయితే, చైనీస్ అథ్లెట్ జౌ యాకిన్‌ పతకం తర్వాత మారలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు రెస్టారెంట్‌లో సహాయం చేస్తోంది. 

జౌ వీడియో బయటపడింది. దీనిలో ఆమె రెస్టారెంట్‌లో కస్టమర్‌లకు ఆహారం అందిస్తున్నట్లు కనిపించింది. తన తల్లిదండ్రుల రెస్టారెంట్‌లో ఒలింపిక్ యూనిఫాంలో పనిచేస్తోంది.

జిమ్నాస్టిక్స్ బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత, ఆమె వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, జౌ బంగారు,  కాంస్య పతక విజేతలతో పోడియంపై నిలబడి ఉంది. 

ఒలింపిక్ సంప్రదాయం ప్రకారం, ఇద్దరు అథ్లెట్లు తమ పతకాలను పళ్లతో కొరికారు. కానీ జౌకు దాని గురించి తెలియదు. పోడియంపై ఉన్న మరో ఇద్దరు అథ్లెట్లను చూసి తన పతకాన్ని కొరుకుతున్నట్లు కనిపించింది.