'ఆ వ్యాధితో బాధపడుతున్నా.. త్వరలో రిటైర్మెంట్'

TV9 Telugu

3 September 2024

ఫ్యాన్స్‌కు భారత స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ బిగ్ షాక్ ఇచ్చింది. తను ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది.

షాకిచ్చిన సైనా నెహ్వాల్

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, దాని వల్ల ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారిందని సైనా నెహ్వాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

అర్థరైటిస్‌తో బాధ

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నందున ఈ ఏడాది చివరికల్లా రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని సైనా తెలిపింది.

రిటైర్మెంట్‌పై త్వరలో నిర్ణయం

మోకాలు బాగోలేదని, కీళ్లనొప్పులు ఉన్నాయని, మృదులాస్థి కూడా దెబ్బతిన్నదని సైనా చెప్పింది. దీంతో ఇక ముందు కొనసాగడం కష్టమని తెలిపింది.

సైనాకి ఏమైంది?

ఇప్పుడు తనకు 8-9 గంటలు ప్రాక్టీస్ చేయడం కష్టమని, తక్కువ ప్రాక్టీస్‌తో ఇతర ఆటగాళ్లను సవాలు చేయలేనని సైనా చెప్పింది.

ప్రాక్టీస్ చేయడం కష్టం

తన కెరీర్ ముగియబోతున్నప్పటికీ.. అందుకు గర్వపడుతున్నానని సైనా తెలిపింది. 9 ఏల్ల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.

కెరీర్ పట్ల గర్వంగా ఉంది

లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించింది. ఇది కాకుండా, ఆమె 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించింది.

సైనా కెరీర్

తాజాగా ప్రెసిడెంట్ ముర్ముతో కలిసి బాడ్మింటన్ ఆడిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి కొంతసేపు సరదాగా ఆడారు.

ప్రెసిడెంట్‌తో కలిసి ప్రాక్టీస్