TV9 Telugu
04 February 2024
దిగ్గజ బౌలర్లకే షాకిచ్చిన బుమ్రా.. ఆ విషయంలో అగ్రస్థానం..
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన డేంజరస్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను భయపెట్టాడు.
విశాఖపట్నం టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి కేవలం 253 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
దీంతో బుమ్రా టెస్టు క్రికెట్‌లో 150 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. బుమ్రా తన 34వ టెస్టు (64వ ఇన్నింగ్స్)లోనే ఈ ఘనత సాధించాడు.
దీంతో పాటు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, జేమ్స్ అండర్సన్‌లను అధిగమించాడు. ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇదే అత్యుత్తమ సగటు రికార్డు. టెస్టు క్రికెట్‌లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో భారత సూపర్ స్టార్ అత్యుత్తమ సగటు పరంగా రెండో స్థానంలో ఉన్నాడు.
34 టెస్టుల్లో 64 ఇన్నింగ్స్‌ల్లో 152 వికెట్లు పడగొట్టిన బుమ్రా సగటు 20.28. అంటే ప్రతి 20.28 పరుగులకు ఒక వికెట్ పడింది.
ఈ విషయంలో ఇంగ్లండ్ మాజీ దిగ్గజం సిడ్నీ బర్న్స్ (16.43) మాత్రమే భారత స్టార్ పేసర్ కంటే ముందున్నాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు అతని కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మురళీధరన్ సగటు 22.72, వార్న్ 25.41, అండర్సన్ 26.38.
ఇక్కడ క్లిక్ చెయ్యండి