అప్పట్లో గ్లామర్‌కు కేరాఫ్ సిల్క్ స్మితే.. ఎంత పెద్ద స్టార్ హీరో ఫిల్మ్ అయినా..
ఈ బ్యూటీ పాట ఉండాల్సిందే..స్టార్ హీరోలకు సమానంగా ఆమె క్రేజ్..
అలాంటి సిల్క్ స్మిత చనిపోతే... చూడ్డానికి ఎవరూ రాలేదు..
అప్పటి వరకు తన వెంట పడిన స్టార్ హీరోలు కనీసం స్పందించలేదు
కానీ యాక్షన్ హీరో అర్జున్ మాత్రం ఆమె కడసారి చూపుకు వచ్చారు...
జీవచ్చవంలా ఉన్న ఆమెను చూసి బోరున ఏడ్చారు..అలా ఎందుకు ఏడ్చారని. అర్జున్‌ను ఓ రిపోర్టర్ అడగగా..
'నేను చనిపోతే చూడ్డానికి వస్తావా .. అని స్మిత అడిగారు.. ఆ తరువాతే ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించారు'
అది గుర్తొచ్చే తాను అంతలా ఏడ్చా అని చెప్పారు అర్జున్!