ఐర్లాండ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది

జాస్పర్‌ క్రాస్ అనే వ్యక్తి తన ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కాదు, కానీ ఇదే నిజం

ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన షాకింగ్‌ నిజాలు  బయటపడ్డాయి

గత ఏప్రిల్‌లో తను పెంచుకుంటున్న కోడిపుంజు దాడిలో గాయపడ్డా జాస్పర్‌కు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది

అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో జాస్పర్‌ మరణించాడు

ఈ కేసుకు సంబంధించిన విచారణలో జాస్పర్ తన పెంపుడు కోడి దాడి చేయడం వల్ల చనిపోయినట్లు వెల్లడైంది

కాగా ఆ కోడిపుంజు గతంలో తన కూతురుపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించినట్లు  క్రాస్‌ కూతురు పేర్కొంది