సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్‌’.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయకిగా నటిస్తుంది.

ఈ చిత్రంలో కన్నడ నటుడు మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం ఈ నెల 28న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రానుంది

శనివారం అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం

‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే స్పై చిత్రమిది. చిత్రం ఈ వేసవిలో వినోదాన్ని పంచుతుంద’’ని తెలిపారు మూవీ మేకర్స్

వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిజా  స్వరాలు సమకూరుస్తున్నారు